Telugu Gateway
Politics

ఆర్టీసి సమ్మె ముగింపు ఎక్కడిది..ఆర్టీసీనే ముగుస్తది

ఆర్టీసి సమ్మె ముగింపు ఎక్కడిది..ఆర్టీసీనే ముగుస్తది
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆర్టీసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ మునగక తప్పదు. దాన్ని ఎవరూ కాపాడలేరు. ఇప్పటికే మునిగిపోయింది అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆర్టీసీ సమ్మెపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. హుజూర్ నగర్ ఫలితంపై మాట్లాడేందుకు విలేకరుల సమావేశం పెట్టిన కెసీఆర్ మీడియా ప్రశ్నలకు సమాధానంగా ఆర్టీసి వ్యవహారంపై స్పందించారు. కార్మికులు అసంబద్ధమైన..అర్ధం పర్ధం లేని డిమాండ్ లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే మాంద్యం పరిస్థితుల కారణంగా ఎలాంటి డంబాచారాలకు పోకుండా బడ్జెట్ నే తగ్గించుకున్నామని తెలిపారు. అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఇది అని తెలిపారు. దేశాన్ని అతి తీవ్రమైన ఆర్ధిక మాంద్యం ఎదుర్కొంటోందని తెలిపారు. రాష్ట్ర రవాణా సంస్థ గురించి నాకంటే ఎక్కువ ఎవరికైనా అవగాహన ఉందని తాను అనుకోనని అన్నారు. 1997-98లో ఆర్టీసిని తానే లాభాల్లోకి తెచ్చానని తెలిపారు. దేశంలో ఆటోమొబైల్ రంగం కూడా కుప్పకూలిపోయిందని అన్నారు. భారత దేశ చరిత్రలో..ఏ రాష్ట్ర ఆర్టీసి చరిత్రలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో 67శాతం జీతాలు పెంచిన చరిత్ర ఉందా? అని ప్రశ్నించారు. ఇది నిజం కాదా?. ఇది ఏమైనా అబద్ధమా?. ఇంకా గొంతెమ్మ కోరికలు కోరతాం అంటే అర్ధం ఉంటుందా?.

ఎవరు పడితే వాడు గవర్నమెంట్ లో కలపమంటే కలుపుతారా? అంత ఈజీనా?. గవర్నమెంట్ లో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. మిగతా 57 కార్పొరేషన్లు కూడా కలపమంటే సాధ్యమవుతుందా?. అసంబద్ధమైన..అర్ధరహితమైన విధానమా? పనికి మాలిన రాజకీయ పార్టీలు..తలకు మాసిన పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇది రాజకీయమా?. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పనేనా?. 67 శాతం జీతాలు పెంచాక ఇక డిమాండ్లు ఉంటాయా?. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో ఆర్టీసీ లే లేవు. మూసేశారు. వీళ్ళ సమ్మె. అర్ధం..ఆలోచన..బుద్ధి జ్ణానం ఉండే చేసే సమ్మెలేనా?. తిన్నది అరక్క చేసిన సమ్మెలా?. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ లు ఏ గవర్నమెంట్ ఉన్నా సమ్మెలు తప్పవా? ఎన్నికల కోసం చేసే సమ్మెలు?. నాలుగు ఓట్లు రాబట్టకుండా చిల్లరమల్లర యూనియన్ రాజకీయాల సమ్మెలు. ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడిది. ఆర్టీసీనే ముగుస్తది. ఐదు వేల కోట్ల రూపాయల ఆప్పులు. ఒక నెల కిస్తె కట్టుకోకపోతే ఎన్ పీఏ అవుతుంది. 1200 కోట్ల రూపాయల నష్టాలు. ప్రైవేట్ ట్రావెల్స్ లాభాల్లో ఉంటాయి..నువ్వు నష్టాల్లో ఎలా ఉంటావు?. దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో పనిచేస్తాం..మీరు కాపాడండి అంటే సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు.

Next Story
Share it