Telugu Gateway
Telangana

కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలి

కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలి
X

ఆర్టీసి సమ్మె వ్యవహారంపై హైకోర్టు సోమవారం నాడు అటు ప్రభుత్వానికి.ఇటు కార్మిక సంఘాలకు పలు సూచనలు చేసింది. కార్మికుల డిమాండ్లపై ఆర్టీసి యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని సూచించింది. అదే సమయంలో రాత్రికి రాత్రే ప్రభుత్వంలో ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించింది. చర్చలు జరిగితేనే కార్మికుల్లో కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుందని అభిప్రాయపడింది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాల తీరు వల్ల మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. బస్సులకు సంబంధించి టూల్స్‌, స్పేర్‌పార్ట్స్‌ కు కూడా బడ్జెట్‌ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ఆర్టీసి సమ్మె వ్యవహారంపై హైకోర్టులో సోమవారం నాడు సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు విన్నది. మంగళవారం నాడు మరోసారి ఈ అంశంపై విచారణ చేపట్టనుంది. ఆర్ధిక భారం కాని అంశాలపై చర్చలు జరగాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం బుధవారం నాటికి విచారణను వాయిదా వేయాలని కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది.

తొలుత ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్దమని కోర్టు కు తెలిపారు. గతంలో ఆర్టీసీ కార్మికులు కోరినప్పుడు జీతాలు పెంచామని నివేదించారు. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మె చట్టవిరుద్ధమైతే వారి పై సంస్థ ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పండి అంటూ హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ప్రభుత్వం ఒకటి డిసైడ్ అయిపోయినట్టు ఉంది. ప్రభుత్వం ఒక నిర్ణయానికి కివచ్చి చర్చలకు వచ్చినట్టు ఉంది . మీకు చర్చలు జరపాలనే ఉద్దేశం ఉందా అన్న హై కోర్ట్ ప్రశ్నించింది. యూనియన్ నాయకులు కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్ లపై చర్చ చేద్దామని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదించినా వారి మాట వినకుండా బయటికి వెళ్ళిపోయారన్నారు. విలీనం డిమాండ్ ను పక్కన పెట్టి మిగతా వాటి పై చర్చించాలన్నాం. మొత్తం 45 డిమాండ్లలో కార్పొరేషన్ పై ఆర్ధిక భారం కానీ డిమాండ్ల పై చర్చ జరగాలన్నాం. ఆర్ధిక భారం లేని డిమాండ్స్ ఫై చర్చలు జరగాలని మేము బావించాం. ఓవర్ నైట్ లో ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యం అవుతుంది అన్న హై కోర్ట్.

సమ్మె నోటీసు ఇచ్చింది మొత్తం డిమాండ్ ల మీద మాత్రమే అన్న ఆర్టీసీ సంఘాలు కేవలం 21 డిమాండ్లు అన్నట్టు అధికారులు ప్రచారం చేశారు చర్చల వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేసిన ఆర్టీసీ యాజమాన్యం. చర్చలు జరిగితేనే కార్మికుల్లో విశ్వాసం పెరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. చర్చల విషయంలో కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని, అన్ని డిమాండ్లపై చర్చకు అవి పట్టుబడుతాయని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు చర్చల వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేసింది. కార్మికుల 21 డిమాండ్లలో రెండు మాత్రమే తమకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, కార్మికులు అడుగుతున్న 16 డిమాండ్లు సంస్థపై ఆర్థికభారం మోపేలా ఉన్నాయని యాజమాన్యం పేర్కొంది. కార్మికులు చేస్తున్న మరో రెండు డిమాండ్లు అసుల పరిగణనలోకి కూడా తీసుకోలేనివిధంగా ఉన్నాయని ఆర్టీసీ సంస్థ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు.

Next Story
Share it