Top
Telugu Gateway

మహిళా కండక్టర్ ఆత్మహత్య

మహిళా కండక్టర్ ఆత్మహత్య
X

ఆర్టీసి సమ్మె ఆగటం లేదు. కార్మికుల ఆత్మహత్యలు ఆగటం లేదు. ఇఫ్పటికే పలువురు రకరకాల మార్గాల్లో తనువు చాలించగా..సోమవారం నాడు ఖమ్మంలో ఓ మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. 31 సంవత్సరాల వయస్సు ఉన్న కండక్టర్ నీరజ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. ఆమె సత్తుపల్లి డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె విషయంలో సర్కారు వైఖరితో తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న కార్మిక సంఘాల నేతలు ఆమె నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియటంతో సత్తుపల్లి డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. సోమవారం మధ్యాహ్నం కోర్టులో సమ్మె అంశంపై విచారణ జరగనుంది. మరి ఈ విచారణతో అయినా సమ్మెకు ముగింపు పడుతుందో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it