Telugu Gateway
Telangana

ఆర్టీసి సమ్మె..సర్కారు కౌంటర్ పై హైకోర్టు అసంతృప్తి

ఆర్టీసి సమ్మె..సర్కారు కౌంటర్ పై హైకోర్టు అసంతృప్తి
X

ఆర్టీసి సమ్మెకు సంబంధించి దాఖలైన పిటీషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కేసును 15వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసి సమ్మె వల్ల ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పిటీషనర్ల తరపు లాయర్లు కోర్టుకు నివేదించగా..సమ్మె ప్రభావం పెద్దగాలేదని సర్కారు చెబుతోంది. ఈ కేసు విచారణ సందర్భంగా బస్ పాస్ లను అనుమతిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. ఇప్పటికే అన్ని డిపో మేనేజర్ల కు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామని ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు.

మరోసారి పూర్తి వివరాలతో రిపోర్ట్ అందించాలని ప్రభుత్వం కు ఆర్టీసీ యాజమాన్యం కు హైకోర్టు ఆదేశం. గురువారం ప్రభుత్వం దాఖలు చేసీన కౌంటర్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కోర్టులో ఈ కేసు తేలాలంటే 15 వరకూ వేచిచూడాల్సిందే. ఇఫ్పటికే బస్సులు లేక దసరా పండగకు ఊళ్ళు వెళ్లిన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా అంతా బాగానే ఉందని చెబుతోంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని సర్కారు కోర్టుకు నివేదించింది.

Next Story
Share it