Top
Telugu Gateway

కెసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కెసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై ఎంపీ రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసి సమ్మెకు సంబంధించి ఆయన కెసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసి ఉద్యోగులకు సంబంధించి కెసీఆర్ చెప్పిన మాటలు..ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఊసరవెల్లిని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చినంక ఆర్టీసీ కార్మికుల జీవితాలు అద్భుతం చేస్తామని హామీ లిచ్చారన్నారు. గత ఐదున్నర సంవత్సరాల కాలంలో ఆర్టీసి అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉధ్యోగాలే ఉండకూడదని..వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగు గుర్తించాలని ఉద్యమ సమయంలో కెసీఆర్ పెద్ద పెద్ద ప్రకటనలు చేశారని విమర్శించారు. చివరకు ప్రభుత్వ కార్పొరేషన్ గా ఉన్న ఆర్టీసి ఉద్యోగులనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు మనసు రావటంలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసి ఉద్యోగుల పాత్రను మరవలేమన్నారు. ఆర్టీసి సమ్మెను దృష్టిలో పెట్టుకుని రేవంత్ ఈ లేఖ రాశారు. తక్షణమే వారికి న్యాయం చేయాలని కోరారు.

Next Story
Share it