Telugu Gateway
Telangana

కెసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కెసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కెసీఆర్ ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సోమవారం నాడు చంచల్ గూడ జైలులో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా అరెస్ట్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు మోజో టీవీ మాజీ సీఈవో రేవతి కూడా ఉన్నారు. రవిప్రకాష్ తో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలోనే కేసీఆర్ కుటుంబం 'దండుపాళ్యం'ముఠా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ విలేకరి హరీష్ రావు టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించగా..ఎందుకొస్తారయ్యా వాళ్లంతా ఒకటే దండుపాళ్యం ముఠా అని ఆరోపించారు.

ఒకరు కన్నాలు వేస్తారు..ఒకరు పగలగొడతారు..మరొకరు మోసుకోస్తారు అంటూ వ్యాఖ్యానించారు. దండుపాళ్యం ముఠా గురించి మీకేమి అనుమానాలు అక్కర్లేదు అని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి శాశ్వతంగా అధికారంలో లేరని..ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలదీ అదే పరిస్థితి అన్నారు. అలాగే చంద్రశేఖర్ రావు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎట్లా అయితే వాళ్ళు మూల్యం చెల్లించారో వీళ్ళు కూడా మూల్యం చెల్లించకతప్పదన్నారు.

Next Story
Share it