Telugu Gateway
Telangana

పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్

పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్
X

సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీవీ9 యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డైరక్టర్ల అనుమతి లేకుండా సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాష్ చెక్కులతో డబ్బులు డ్రా చేసి దుర్వినియోగం చేశాడనేది ఆయనపై మోపుతున్న అభియోగం. ఇలా కోట్ల రూపాయల మేర దుర్వినియోగం చేశారని టీవీ9 కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేసింది. 18 కోట్ల రూపాయలను అనుమతి లేకుండా డ్రా చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై చీటింగ్ కేసు పెట్టారు.

దీంతో పాటు గతంలో పోలీసుల విధులకు ఆటంకటం కల్పించారనే అభియోగంపై కూడా పోలీసులు రవిప్రకాష్ ను విచారిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలోనే టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్ పై పలు కేసులు పెట్టినా ఆయన కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకుని అరెస్ట్ కాకుండా చూసుకున్నారు. కొద్ది రోజుల పాటు అజ్ణాతంలోకి వెళ్ళి వచ్చారు. తర్వాత మీడియా ముందుకు వచ్చి టీవీ9 నూతన యాజమాన్యంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు కొత్త కేసులతో రవిప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం ఆసక్తికర పరిణామంగా మారింది.

Next Story
Share it