Telugu Gateway
Cinema

‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
X

‘ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?. అబ్బ కడుపు నిండిపోయింది బంగారం అంటూ హీరో అల్లు అర్జున్ వాయిస్. పండుగానికి ట్వంటీ టూ..బస్తీలో మస్త్ కటౌట్. బచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేది. వచ్చినమంటే చుట్టూ’ అంటూ సాగే రాములో ..రాములా ఫుల్ సాంగ్ వచ్చేసింది. అల..వైకుంఠపురము చిత్ర యూనిట్ ముందు ప్రకటించినట్లుగా శనివారం సాయంత్రం ఈ పాటను విడుదల చేసింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్నఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది.

మరో హీరో సుశాంత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా కావటం కూడా దీనికి ఓఓ కారణం. తొలి పాట సామజవరగమన ఎన్నో రికార్డులు సృష్టించిందో తెలిసిందే. మరి ఈ రాములో రాములా పాట మరిన్ని కొత్త రికార్డులు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=wFAj0pW6xX0

Next Story
Share it