Telugu Gateway
Cinema

రకుల్ సంచలన నిర్ణయం!

రకుల్ సంచలన నిర్ణయం!
X

రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ తో పాటు తమిళంలోనూ ఓ హవా నడిపించిన హీరోయిన్. కాకపోతే గత కొంత కాలంగా రకుల్ కు సరైన హిట్ రావటం లేదు.పలు సినిమాల్లో నటించినా అందాల అరబోతతో సరిపుచ్చుతోంది. దీంతో ఇప్పుడు అమ్మడు రూటు మార్చుకున్నట్లు కన్పిస్తోంది. ఇక నుంచి కథలో దమ్ము ఉంటేనే సినిమాలకు ఓకే చెబుతానంటుంది ఈ భామ. తనకు ఆఫర్లు చాలా వస్తున్నా కథలు నచ్చకే అటు తమిళంతోపాటు ఇటు తెలుగులోనూ కొత్త సినిమాలు అంగీకరించటంలేదని చెప్పకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.

గతంలో కష్టపడి ఎన్నో సినిమాలు చేసినా ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదని ఇప్పుడు బాధపడుతోంది. అంతే కాదు..కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటానని చెబుతోంది రకుల్. మంచి కథతోపాటు నచ్చిన పాత్ర వస్తేనే సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది. మరి రకుల్ ప్రీత్ సింగ్ కోసం ఎవరు అంత మంచి కథలు, పాత్రలు రెడీ చేస్తారో వేచిచూడాల్సిందే. బాలీవుడ్ లోకి ప్రవేశించినా అక్కడా కూడా పెద్దగా రకుల్ క్లిక్ కాలేదనే చెప్పాలి. దీంతో ఇక ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. మరి ఈ నిర్ణయం ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Next Story
Share it