Telugu Gateway
Telangana

తెలంగాణలో ప్లాస్టిక్ పై నిషేధం

తెలంగాణలో ప్లాస్టిక్ పై నిషేధం
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అత్యంత కీలక నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ పై నిషేధం విధించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో మంత్రివర్గంలో దీనిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గురువారం నాడు హైదరాబాద్ లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కెసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామాల్లో విజయవంతమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని.. పల్లె ప్రగతిని విజయవంతం చేసిన డీపీవోలు, డీఎల్ పీవోలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చింది. భవిష్యత్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం.

గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శి నుంచి డీపీవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినం. గ్రామపంచాయతీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రానివ్వం. గ్రామాల అభివృద్ధికి నెలకు రూ.339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ నెల గ్రామపంచాయతీలకు రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. గ్రామపంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి ఇది అదనమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యాయి. పవర్ వీక్ ను విద్యుత్ సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు. అన్ని శాఖల్లో కంటే విద్యుత్ శాఖ మొదటి స్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్ లో కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు నిర్దేశించారు.

Next Story
Share it