ఆర్టీసీ విలీనంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఆర్టీసి విలీనంపై మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం కెసీఆర్ చేసి వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. కెసీఆర్ వ్యాఖ్యలు తమలో మరింత కసిని పెంచాయని..ఖచ్చితంగా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి తీరతామని స్పష్టం చేశారు. ఓ వైపు అంతా ప్రైవేట్ పరం అవుతున్న దశలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇఛ్చిన హామీ మేరకు ఇప్పటికే మంత్రివర్గ ఆమోదం తెలిపిందని అన్నారు. మూడు నెలల్లోనా..ఆరు నెలల్లోనే విలీనం పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటామని అన్నారు. ఇది మొండిగా..గట్టిగా తీసుకున్న నిర్ణయం అన్నారు.
కెసీఆర్ వ్యాఖ్యలు తమలో కసిని, బాధ్యతను మరింత పెంచాయని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కెసీఆర్ ఏపీలో విలీనమా మన్నా..ఏమి అయింది ఓ ఆరు నెలల ఆగండి అసలు సంగతి తెలుస్తుంది అని వ్యాఖ్యానించి కలకలం రేపారు. విజయవాడ ఆర్టీసీ ఆస్పత్రిలో ఎంపీ కేశినేని నాని ఎంపీ నిధులతో చేపట్టిన భవనాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలను అందరూ చూస్తున్నారని అన్నారు.