Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు

రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు
X

మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి చిక్కుల్లో పడనున్నారా?. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా?. అంటే ఏదైనా జరగొచ్చు అని చెబుతున్నాయి పోలీసు వర్గాలు. దీనికి కారణం ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా ఆర్టీసి కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ కు చేరుకునే సమయంలో రేవంత్ రెడ్డి తన ఇంటి దగ్గర ఉన్న పోలీసుల విధులకు ఆటంకటం కల్పించటంతోపాటు..అడ్డుకున్నారని ఆరోపిస్తూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో సెక్షన్ 332తోపాటు 341, 332 ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి నివాసం వద్ద విధుల్లో ఉన్న ఎస్‌ఐ నవీన్ రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు నమోదు అయింది.

సోమవారం ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.48లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్‌ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌ ఏసీపీ కే.ఎస్‌.రావు, జూబ్లీహిల్స్‌ ఇన్ స్పెక్టర్‌ కె.బాలకృష్ణారెడ్డి, సెక్టార్‌ ఎస్‌ఐ నవీన్ రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొ చ్చారు. ఆ సమయంలో అడ్డుకున్న ఎస్‌ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై దూసుకుపోయారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుల విచారణ సాగుతుంది.

Next Story
Share it