Telugu Gateway
Telangana

ఆర్టీసీ విలీనం మా విధానం కాదు..సమ్మె చట్ట విరుద్ధం

ఆర్టీసీ విలీనం మా విధానం కాదు..సమ్మె చట్ట విరుద్ధం
X

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం తమ విధానం కాదని..అలా అని తాము ఎక్కడా హామీ కూడా ఇవ్వలేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం..అసంబద్ధం అని వ్యాఖ్యానించారు. కొంత మంది కార్మిక సంఘాల నేతలు చర్చలు ముగియక ముందే సమ్మెకు వెళ్లారని ఆరోపించారు. సమ్మెను సమర్దవంతంగా ఎదుర్కొని ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చామన్నారు. అజయ్ కుమార్ శనివారం నాడు రవాణా శాఖ ఉన్నతాధికారులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్టీసిని ప్రైవేట్ పరం చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకురావాలంటే కొన్ని చర్యలు తప్పవన్నారు. 7358 వాహనాలను ప్రజల అవసరాల కోసం వాడుతున్నమని తెలిపారు.కార్మిక సంఘాలను అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్న ప్రతిపక్షాలు...ప్రజలకు ఇబ్బందులను గురిచేసే చర్యలను సమర్దిస్తరా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వాలు అదికారంలో ఉన్న చోట ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా?. అసంబద్ద ఆరోపణలు చేస్తే ప్రజలు మిమ్మల్నీ చీదరించుకుంటారు.

ఇలా చేస్తేనే గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ 4416 కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. కానీ లక్ష కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించటం సరికాదన్నారు. పదమూడు కోట్లు నష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి రవాణా శాఖ మంత్రి గా ఉన్న కేసియార్ గారు 14 కోట్లకు లాభాలు తెచ్చారు. తర్వాత ఎప్పుడూ ఆర్టీసి లాభాల్లోకి రాలేదన్నారు. పండగ సమయంలో సమ్మెకు వెల్లి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూశారు. కానీ బెడిసికొట్టింది. బీజేపీ ప్రభుత్వం రైల్వేలనే ప్రైవేట్ పరం చేస్తుంది. ప్రతిపక్షాలు బాద్యాతాయుతంగా మాట్లాడాలి. కార్మికులు విదుల్లోకి రాకున్న ప్రజా రవాణా సాఫీగానే సాగుతుంది. ప్రతి సంవత్సరం ఐదు లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నయి. ప్రయాణికులు తమ రవాణా సౌకర్యాలు మార్చుకుంటున్నప్పుడు, ఆర్టీసీ కూడా మారాలి. సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి తీసుకెల్లారు. వీరు గతంలో ఎన్నడు సమ్మెలోకి వెళ్ళలేదు. వీరి ద్వారానే టికెటింగ్ మిషన్ లు ఇచ్చే అవకాశం ఉండేది. పోలీస్, రవాణా శాఖల సమన్వయం తో అధిక చార్జీల పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని బస్ పాస్ లు పనిచేస్తాయని తెలిపారు

Next Story
Share it