Telugu Gateway
Telangana

జీతాలకు డబ్బుల్లేవ్

జీతాలకు డబ్బుల్లేవ్
X

ఆర్టీసి కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించేందుకు తమ దగ్గర డబ్బుల్లేవని సంస్థ యాజమాన్యం కోర్టుకు నివేదించింది. జీతాల చెల్లింపులకు 230 కోట్ల రూపాయలు అవసరం అయితే..తమ దగ్గర కేవలం 7.5 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. వాస్తవానికి కోర్టు ఆదేశాల మేరకు సోమవారం జీతాలు చెల్లిస్తామని గతంలో యాజమాన్యం అంగీకరించింది. కార్మికులకు జీతాల చెల్లింపు పిటీషన్ పై హైకోర్టులో సోమవారం నాడు మరోసారి విచారణ జరిగింది. ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగటం యాజమాన్యం సెప్టెంబర్ నెల వేతనాలు కూడా చెల్లించకుండా నిలుపుదల చేసింది.

కోర్టులో విచారణ సందర్బంగా పిటీషనర్ తరపు న్యాయవాది పలు అంశాలను లేవనెత్తారు. ‘సమ్మె కొనసాగుతున్నా.. 50 శాతం బస్సులను తిప్పుతున్నామని ప్రభుత్వం చెప్తోంది. మరి వచ్చిన ఆదాయమంతా ఎక్కిడికి పోయింది’అని వాదించారు. తక్షణమే 48 వేల మంది ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్‌ నెల వేతనాలను ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 28న ఆర్టీసీపై డివిజన్ బెంచ్‌లో విచారణ అనంతరం వేతనాల చెల్లింపు పిటిషన్‌పై విచారణ చేపడతామమని వెల్లడించింది. తదుపరి విచారణ 29కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

Next Story
Share it