వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ
BY Telugu Gateway30 Oct 2019 11:01 AM IST
X
Telugu Gateway30 Oct 2019 11:01 AM IST
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తాము ఎవరికీ జూనియర్ పార్టీగా ఉండబోమని..సొంతంగానే ఎన్నికల బరిలో దిగుతామని వెల్లడించారు. అదే సమయంలో ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
వలసల ను ఆపుకోవటం కోసమే పొత్తుల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. విజయవాడలో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ ప్రధాన తెలి
Next Story