Telugu Gateway
Telangana

మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు పెంపు

తెలంగాణ సర్కారు మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రెట్టింపు చేసింది. గతంలో నాన్ రిఫండబుల్ ఫీజు లక్ష రూపాయలు మాత్రమే ఉండగా..ఇప్పుడు అది రెండు లక్షల రూపాయాలకు పెరిగింది. నూతన మద్యం విధానానికి సంబంధించి సర్కారు గురువారం నాడు నోటిపికేషన్ జారీ చేసింది. నూతన విధానం 2019 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అదే సమయంలో మద్యం దుకాణాల వేళల సమయాన్ని కూడా ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ తెరిచి ఉండొచ్చు.

ఇతర ప్రాంతాల్లో మాత్రం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ అనుమతి ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేశారు. గతంలో ఉన్న నాలుగు శ్లాబులను ఇప్పుడు ఆరు శ్లాబులుగా మార్చారు. ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారు. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షల రూపాయలు ఫీజా నిర్దారించారు. లక్ష లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మాత్రం 60 లక్షల రూపాయల ఫీజు ఉంది. గరిష్ట లైసెన్స్ ఫీజు మాత్రం 1.10 కోట్ల రూపాయలుగా ఉంది.

Next Story
Share it