Telugu Gateway
Cinema

కొత్త సినిమా ప్రారంభించిన నాని

కొత్త సినిమా ప్రారంభించిన నాని
X

హీరో నాని కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. అయితే ఇది ఆయన హీరోగా తెరకెక్కకుతున్న సినిమా కాదు. ఆయన నిర్మాణ సంస్థలో మరో హీరోతో ఆయన ఈ సినిమా ప్రారంభించారు. ఇఫ్పటికే ‘ఆ!’ సినిమాతో తనదైన మార్క్ చూపించిన నాని ఇఫ్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. వాల్‌పోస్టర్‌ సినిమా సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ హీరో ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

హీరోయిన్ గా రుహాని శర్మను ఎంపిక చేశారు. ఈ సినిమా ద్వారా శైలేష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించనున్న ఈ సినిమాకు ప్రశాంతి నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ తాజాగా హైదరాబాద్‌లో పూజకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో-హీరోయిన్ల తొలి సీన్‌కు నాని క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను నాని ట్విటర్‌లో విడుదల చేశారు.

Next Story
Share it