Telugu Gateway
Politics

అలా చేస్తే కెసీఆర్ సీఎం అయ్యేవారా?

అలా చేస్తే కెసీఆర్ సీఎం అయ్యేవారా?
X

ఉద్యమ సమయంలో కూడా ఇలాగే ఇబ్బంది పెట్టి ఉండే ఇప్పుడు కెసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ప్రశ్నించారు సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. పరిస్థితులు చేయి దాటకముందే.. మేల్కొంటే మంచిదని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మంచి పని చేశారని ప్రశంసించారు. ఆర్టీసీపై గవర్నర్‌ సమ్మెపై ఆరా తీస్తున్నారంటే.. కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది మొదలయినట్లే అని తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రానికి పెద్ద దిక్కులాంటి వారని.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా సీఎం ఓ మెట్టు దిగి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. హై కోర్టు చురకలంటించినా.. కేసీఆర్‌ తీరు మారకపోవడం బాధకరమన్నారు.

Next Story
Share it