Telugu Gateway
Andhra Pradesh

ఎవరి ఖాతాల్లోకి ‘మెఘా’ హవాలా నిధులు?!

ఎవరి ఖాతాల్లోకి ‘మెఘా’ హవాలా నిధులు?!
X

ఒకే దెబ్బకు చాలా మంది ‘ఫిక్స్’ అయినట్లేనా?

ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఐటి శాఖ స్పష్టంగా వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారాయని అధికారికంగా స్పష్టం చేసింది. మరి ఈ లెక్కన హవాలా రూపంలో ఎవరి ఖాతాల్లోకి నిధులు వెళ్ళాయి?. ఇందుకు సహకరించిన వారు ఎవరు?. వారి ఖాతాల వివరాలేంటి?. ఐటి శాఖ మరి ఇప్పుడు ఆ తవ్వకాలు కూడా ప్రారంభిస్తుంది. అది పూర్తయితే మరిన్ని సంచలనాలు నమోదు కాబోతున్నాయా?. అంటే ఔననే చెబుతున్నాయి ఐటి వర్గాలు. ఐటితోనే ఈ వ్యవహారం ఆగిపోతుందా?. హవాలా రూపంలో భారీ ఎత్తున నిధుల తరలింపు జరిగింది అంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలు కూడా రంగంలోకి దిగుతాయా?. అంటే ఛాన్స్ ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. చూస్తుంటే కేంద్రం ఒక్క దెబ్బకు చాలా మందినని ‘ఫిక్స్’ చేస్తున్నట్లు కన్పిస్తోంది.

ఈ పరిణామంతో కీలక నేతలు విలవిలలాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని..ఈ ప్రభావం ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ లో స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు కూడా ఇలాంటి అంశాల్లో ఎక్కువ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. తెలంగాణ బిజెపి నేతలు కూడా గత కొంత కాలంగా ఈ సంస్థకు చెందిన అంశాలపై స్పష్టంగా టార్గెట్ చేస్తున్నారు. అంతే కాదు..ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. హవాలా మార్గంలో నిధుల తరలింపు వ్యవహారం బయటపడటంతో ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందనే అంశంపై అధికార, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఐటి శాఖ మెఘాలో మీట నొక్కితే ఎక్కడెక్కడో ‘వణుకు’ ప్రారంభం అయిందని చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏవి ఉన్నా తన హవాను చెలాయిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it