‘మంచు మనోజ్’ న్యూజర్నీ స్టార్ట్

మంచు మనోజ్ ఇటీవలే సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే భార్య ప్రణతితో విడిపోయినట్లు తెలుపుతూ త్వరలోనే కొత్త జర్నీ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించాడు. భారమైన హృదయంతోనే వ్యక్తిగత జీవితంలో ఈ నిర్ణయం తీసుకున్నా పరస్పర ఆమోదంతోనే ముందుకు సాగుతున్నట్లు తెలిపి గత కొంత కాలంగా సాగుతున్న ప్రచారానికి తెరదించారు. మంచు మనోజ్ న్యూ జర్నీ ఏంటి అంటే ‘ఎమ్‌ఎమ్ ఆర్ట్స్’పేరిట సొంత ప్రొడక్షన్ హౌజ్‌ను ఆదివారం ప్రారంభించారు. దీపావళి పర్వదినాన సొంత ప్రొడక్షన్ హౌజ్‌కు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కొత్త జర్నీలో అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ప్రొడక్షన్ హౌజ్‌కు సంబంధించిన లోగోను కూడా మంచు మనోజ్ విడుదల చేశారు. భవిష్యత్‌లో మా ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చే మంచి సినిమాలను మీరు చూస్తారు. మంచు మనోజ్ కొత్త నిర్మాణ సంస్థ ఏర్పాటుపై టాలీవుడ్ స్వాగతించింది. అంతేకాకుండా మంచు మనోజ్ నిర్మాణ రంగంలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పలువరు నటీనటులు అభినందనలు తెలిపారు.