Telugu Gateway
Politics

కెటీఆర్ అంటే కల్వకుంట్ల ట్విట్టర్ రావు

కెటీఆర్ అంటే కల్వకుంట్ల ట్విట్టర్ రావు
X

తెలంగాణ మంత్రి కెటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి దానికి ట్విట్టర్ లో స్పందించే కెటీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కెటీఆర్ అంటే కల్వకుంట్ల తారకరామారావు కంటే కల్వకుంట్ల ట్విట్టర్ రావుగానే బాగా పాపులర్ అయ్యారని ఎద్దేవా చేశారు. 50 వేల మంది ఆర్టీసి కార్మికుల బాధలు మీకు కన్పించటం లేదా? అని ప్రశ్నించారు. కెసీఆర్ బహిరంగగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన సంగతి ఎలా మర్చిపోతారన్నారు.

ఉద్యోగాలు తొలగిస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడవా..ఇదేమీ ప్రభుత్వానికి పట్టదా అని పొన్నం విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసి కార్మికుల సమస్యలపై స్పందించకపోతే కెటీఆర్ తెలంగాణ ప్రజల దృష్టిలో ఓ ద్రోహిగా మిగిలిపోతారన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికుల కోరుతుంటే వాళ్ళను బెదిరించి దారికి తెచ్చుకోవాలని చూడటం ఏ మాత్రం సరికాదన్నారు.

Next Story
Share it