Telugu Gateway
Andhra Pradesh

నవయుగాకు జగన్ సర్కారు మరో షాక్

నవయుగాకు జగన్ సర్కారు మరో షాక్
X

ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు నవయగాకు మరో షాక్ ఇఛ్చింది. నవయుగ గ్రూప్ నకు చెందిన కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ కు నెల్లూరు జిల్లాలో కేటాయించిన వేల ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయం తీసుకుంది. కారు చౌకగా భూములు దక్కించుకుని సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో ఏపీఐఐసీ ఈ నిర్ణయం తీసుకుంది.

4731 ఎకరాల భూమిని కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంస్థకు ఎకరా 1.15 లక్షల రూపాయల లెక్కన కేటాయింపులు చేసింది. ప్రాజెక్టును నిర్దేశిత గడువు ప్రకారం పూర్తి చేయకపోవటంతోపాటు ఎన్ని నోటీసులు ఇఛ్చినా కంపెనీ సకాలంలో స్పందించపోవటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it