Telugu Gateway
Politics

హుజూర్ నగర్ తీర్పు స్పూర్తితో ముందుకు

హుజూర్ నగర్ తీర్పు స్పూర్తితో ముందుకు
X

తెలంగాణలో కొంత మంది అవాకులు..చవాకులు పేలుతున్నారని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ హుజూర్ నగర్ ప్రజలు తమ అద్భుతమైన తీర్పుతో కెసీఆర్..నువ్వు ముందుకు పో అని చెప్పారని..వారిచ్చిన తీర్పుతో ముందుకు సాగుతానని ప్రకటించారు. శనివారం సాయంత్రం హుజూర్ నగర్ లో జరిగిన కృతజ్ఞత సభలో మాట్లాడుతూ కెసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో నల్లగొండ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీకి.25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇస్తామని అన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తాం. హుజూర్‌నగర్‌లో బంజారా భవన్‌ మంజూరు చేస్తున్నా. ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తాం. హుజూర్‌నగర్‌లో కోర్టు కూడా ఏర్పాటు చేసేలా చూస్తాం.

ఎక్కువ శాతం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తాం’ అన్నారు. పోడు భూముల సమస్యను కూడా పరిష్కరిస్తానని తెలిపారు. కొంత మంది మంత్రి జగదీష్ రెడ్డిని మూడు ఫీట్ల మంత్రి అంటూ ఎద్దేవా చేశారని..ఆయన ఎనిమిది ఫీట్లు ఉన్నాడని తాము చెప్పామా? అని ప్రశ్నించారు. మూడు ఫీట్లు ఉన్న జగదీశ్ రెడ్డి.. 300 కిలోమీటర్ల వరకు కాళేశ్వరం నీళ్లు తెచ్చారు. యాదాద్రి పవర్ ప్లాంట్ త్వరలోనే పూర్తి. జిల్లా అభివృద్ధి ముఖచిత్రం మారిపోతుందని తెలిపారు. హుజుర్ నగర్ కు రింగ్ రోడ్డు, ట్యాంక్ బండ్ మంజూరీ చేస్తున్నామని సభకు హాజరైన వారి హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అభివృద్ధఇతో వెలుగు జిలుగుల తెలంగాణ కావాలన్నారు.

Next Story
Share it