Telugu Gateway
Cinema

కళ్యాణ్ దేవ్ కొత్త సినిమా‘సూపర్ మచ్చి’

కళ్యాణ్ దేవ్ కొత్త సినిమా‘సూపర్ మచ్చి’
X

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తొలి సినిమా ‘విజేత’తో ఆకట్టుకున్నాడు. రెండవ సినిమాకు మాత్రంచాలా గ్యాప్ తీసుకున్నాడు. దీపావళిని పురస్కరించుకుని కొత్త సినిమాను ప్రకటించారు. అదే ‘సూపర్ మచ్చి’ టైటిల్ తో రానుంది. పులి వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఓ ఇంట్రస్టెంగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీపావళి కానుకగా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు, మూవీ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జోరు వానలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న లుక్‌లో మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ‘తూనీగ తూనీగ’ఫేమ్‌ రియా చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story
Share it