Telugu Gateway
Cinema

420 ‘జాతిరత్నాలు’ వచ్చారు

420  ‘జాతిరత్నాలు’ వచ్చారు
X

వాళ్ళ ముగ్గురు జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. వాళ్ళు జాతిరత్నాలు అట. అందులో ఒకడి నెంబర్ 420. మరొకడి నెంబర్ 210. మూడవ వ్యక్తి నెంబర్ మిస్. వారిలో ఒకరు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి. ఈ జాతిరత్నాల్లో ప్రియదర్శి, రామకృష్ణ కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు పిచ్చిపిచ్చిగా నవ్వుతూ ఉన్న ఫోటోను ఈ సినిమా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ గా విడుదల చేసింది. ఇది చూసిన వారు కూడా ఖచ్చితంగా నవ్వుకోవాల్సిందే. వీళ్ల లుక్ తోపాటు ఆ నవ్వులు కూడా అలా ఉన్నాయి మరి.

సత్ప్రవర్తన వల్ల త్వరగా బయటికొస్తున్నారు మా వాళ్ళు.. ఈ దీపావళికి మీ ‘జాతిరత్నాలు’ అంటున్నారు నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ సినమా ద్వారా నిర్మాతగా మారారు. స్వప్న సినిమాతో కలిసి, ‘జాతిరత్నాలు’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ మెయిన్ లీడ్స్‌ గా నటించారు. దీపావళికి ‘జాతిరత్నాలు’ టీజర్ విడుదల కానుంది. ఈ సినిమాకు అనుదీప్ కె వి దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story
Share it