Telugu Gateway
Andhra Pradesh

రైతు భరోసా చెప్పిన దానికంటే ముందే అమలు చేస్తున్నాం

రైతు భరోసా చెప్పిన దానికంటే ముందే అమలు చేస్తున్నాం
X

రైతు భరోసా పథకాన్ని చెప్పిదానికంటే ఎంతోముందుగానే ప్రారంభించామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇది తన మొదటి హామీ అని..రైతన్నల ముఖాల్లో ఆనందం చూసేందుకు ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జగన్ మంగళవారం నాడు నెల్లూరు జిల్లా సింహపురి యూనివర్శిటీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగన్ కొంత మంది రైతులకు భరోసా చెక్కులను అందజేశారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతుల కష్టాలను చూసి 2017 పార్టీ ప్లీనరీ సమావేశంలోనే రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చా. ఇచ్చిన హామీకి ఇంకా మెరుగులు దిద్ది ఆమల్లోకి తీసుకొచ్చాం. చెప్పిన దాని కంటే అదనంగా ఐదేళ్లలో రూ. 17,500 ఇస్తున్నాం. ప్రతీ ఏడాది రూ.13,500 చోప్పున ఐదేళ్లు ఇస్తాం. మేలో రూ. 7,500, అక్టోబర్‌లో రూ.4,000, సంక్రాంతికి రూ.2,000 రైతుల అకౌంట్‌లోకి నేరుగా జమచేస్తాం.

కౌలు రైతులకు కూడా న్యాయం చేసేందుకు రైతు భరోసా అమలు చేస్తాం. అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం వర్తిస్తుంది. రైతు భరోసాతో సుమారు 54 లక్షల మంది రైతన్నలకు మేలు జరుగుతుందని జగన్ తెలిపారు. ప్రభుత్వం రైతులను గుండెల్లో పెట్టుకుంది. నా పాదయాత్రలో రైతుల కష్టాలను చూశాను. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు లేక రైతులు పడ్డ ఇబ్బందులను గమనించాను. బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అరకొరగా ఇచ్చిన పరిస్థితులను నెలకొనడం పరిశీలించాను. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేక వేలం వేసుకున్న పరిస్థితులు ఉండేవి. గత ఐదేళ్లలో లక్షల రైతుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూశామన్నారు.

Next Story
Share it