Telugu Gateway
Andhra Pradesh

జగన్ పాలన.100కు 150 మార్కులు

జగన్ పాలన.100కు 150 మార్కులు
X

‘అంతకు ముందు అడిగారు కదా?. జగన్ పాలన ఎలా ఉంది అని. ఇప్పుడు చెబుతున్నా చూడండి. వందకు 150 మార్కులు ఇస్తున్నా. ’ అంటూ మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు చెందిన 31 బస్సులు సీజ్ చేశారని..తనకు చాలా బస్సులు ఉన్నాయని ..ఇంకా ఏమేమి చేస్తారో చూద్దాం అని వ్యాఖ్యానించారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తమ అబ్బాయే అన్నారు. ఇందులో మార్పేమీ లేదన్నారు. పరిపాలనలో కిందామీద పడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఎన్నో ట్రావెల్స్ బస్సులుండగా ఆయనకి తమ బస్సులే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ చర్యలపై న్యాయపరంగా పోరాడతామన్నారు. 70ఏళ్ల నుంచి వాహనరంగంలో ఉన్నామని.. చిన్న చిన్న లోటు పాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్‌ కైనా సహజమన్నారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారని.. ఫైన్‌లతో పోయే తప్పిదాలకు సీజ్ చేయటం ఎంతవరకు సబబు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకే.. తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. చూసే వారి కళ్లను బట్టి రాయలసీమ అభివృద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it