Telugu Gateway
Politics

బిజెపికి డిపాజిట్ వస్తే అదే ఉపశమనం

బిజెపికి డిపాజిట్ వస్తే అదే ఉపశమనం
X

హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రి కెటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపికి ఈ ఎన్నికలో డిపాజిట్లు వస్తే అదే పెద్ద ఉపశమనం అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అసలు బలం ఏంటో కూడా ఇప్పుడు తేలిపోతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి కలసిపోయాయని ఆరోపించారు. ప్రజలకు చెప్పటానికి ఏమీలేక ఆ రెండు పార్టీలు నానా హంగామా చేస్తున్నాయని విమర్శించారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్, ఓటమి భయంతోనే బిజెపి,, కాంగ్రెస్ దొంగ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కెటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.హుజూర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయం అన్నారు.

Next Story
Share it