‘ఇద్దరిలోకం’ ఒకటే ఫస్ట్ లుక్
BY Telugu Gateway7 Oct 2019 11:55 AM GMT

X
Telugu Gateway7 Oct 2019 11:55 AM GMT
రాజ్ తరుణ్. చాలా గ్యాప్ తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతున్నాడు. సరైన హిట్ లు దక్కకపోవటం ఈ యంగ్ హీరోకు కొంత సమస్యగా మారింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రమే ఈ ‘ఇద్దరిలోకం ఒకటే’. యూ ఆర్ మై హార్ట్ బీట్ ట్యాగ్ లైన్. ఈ సినిమాతో జిఆర్. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
రాజ్ తరుణ్ సరసన ‘అర్జున్ రెడ్డి’ ఫేం శాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం. అభిమానులకు దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. దిల్ రాజు సినిమాతో ‘ఇద్దరిలోకం ఒకటే’తో అయినా రాజ్ తరుణ్ మళ్లీ విజయాల బాట పడతారా..లేదా అన్నది వేచిచూడాల్సిందే.
Next Story