Telugu Gateway
Cinema

కాజల్ ‘పెళ్ళి కబుర్లు’

కాజల్ ‘పెళ్ళి కబుర్లు’
X

టాలీవుడ్ లో ఆమెను అందరూ ‘చందమామ’ అని పిలుస్తారు. ఎందుకంటే అది ఆమె మొదటి సినిమా..అందులో అచ్చం చందమామలాగే కన్పించింది కూడా. కాజల్ టాలీవుడ్ లోకి ప్రవేశించి దశాబ్దంపైనే అయింది. ఎన్నో విజయాలు..కొన్ని అపజయాలు. వాటితో సంబంధం లేకుండా ఆమెకు ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి. సినిమాలు చేస్తూనే ఉంది. గతంలోనూ చాలాసార్లు కాజల్ పెళ్లి వార్తలు హల్ చల్ చేశాయి. కాకపోతే తాజాగా ఈ చందమామ తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అది కూడా ఓ ఇంటర్వూలో. పెళ్ళికి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయని..త్వరలోనే పెళ్లి సంగతి అందరికీ చెబుతానని ప్రకటించింది.

అయితే ఇందుకు ఆమె ఓ కండిషన్ పెడుతోంది. తాను చాలా భక్తురాలిని అయినందున తనకొచ్చే భర్త కూడా మరింత భక్తుడు అయి ఉండాలని కోరుకుంటోంది. ప్రస్తుతం కాజల్ తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ తో కలసి భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. దీంతోపాటు పలు చిత్రాల్లో ఈ చందమామ బిజీగా ఉంది. కాజల్ వెల్లడించిన సమాచారం ప్రకారం 2020లో కాజల్ పెళ్ళి ఖాయం అనుకోవచ్చన్న మాట.

Next Story
Share it