Telugu Gateway
Cinema

రకుల్ టార్గెట్ అదేనట!

రకుల్  టార్గెట్ అదేనట!
X

రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం అడపా దడపా అలా మెరవటం తప్ప..ఆ పాత జోష్ తగ్గిపోయింది. కాకపోతే ఫిట్ నెస్ వీడియోలతో మాత్రం తెలుగు ప్రేక్షకులకు అప్పుడప్పుడు కన్పిస్తూ ఉంది. తాజాగా రకుల్ తన మనసులోని మాటను బయటపెట్టింది. అదేంటి అంటే తెలుగులో తనకు విజయ్ దేవరకొండతో..హిందీలో రణ్ వీర్ సింగ్ తో కలసి చేయాలని ఉందని చెబుతోంది. రకుల్ గతంలోనూ ఇలాగే చెప్పింది. మహేష్ బాబుతో సినిమా చేయాలనుకుంటున్నట్లు. మహేష్ బాబు, రకుల్ ఇద్దరూ కలసి చేసిన సినిమా ‘స్పైడర్’ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

వరుస ఫ్లాప్‌ల కారణంగానే కొత్త చిత్రాల అవకాశాలు రావడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని అందులో ఏ మాత్రం నిజంలేదని చెబుతోంది. హిందీలో పలు అవకాశాలు రావడంతోనే దక్షిణాదిలో అవకాశాలను అంగీకరించలేకపోతున్నట్లు తెలిపింది. అంతేకానీ తనకు అవకాశాలు రాక కాదని పేర్కొంది. కమలహాసన్‌ వంటి ప్రముఖ నటుడితో కలిసి నటించే అవకాశం ఇంతత్వరగా వస్తుందని ఊహించలేదని తెలిపింది.

Next Story
Share it