Telugu Gateway
Telangana

హైదరాబాద్ కు మరో ‘ప్రత్యేక గుర్తింపు’

హైదరాబాద్ కు మరో ‘ప్రత్యేక గుర్తింపు’
X

దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ కు మరో ప్రత్యేక గుర్తింపు. పలు అంతర్జాతీయ సంస్థలతో హైదరాబాద్ ఇప్పుడు ‘గ్లోబల్ సిటీ’గా మారుతోంది. ఈ తరుణంలో హైదరాబాద్ కు యునెస్కో క్రియేటివ్ జాబితాలో భాగ్యనగరానికి చోటు కల్పించింది. ప్ర‌పంచంలోని సృజ‌నాత్మ‌క న‌గ‌రాల నెట్‌వ‌ర్క్‌ లో హైద‌రాబాద్ స్థానం దక్కించుకుంది. యునెస్కో క్రియేటీవ్ సిటీస్ నెట్‌వ‌ర్క్‌ లో చేర్చ‌డానికి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఎంపిక చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 66 న‌గ‌రాల‌ను ఈ నెట్‌వ‌ర్క్‌ లో చోటుచేసుకున్నాయి. వీటిలో భార‌త‌దేశం నుండి ముంబాయి న‌గ‌రాన్ని సినిమా రంగం నుండి ఎంపిక‌చేయ‌గా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఆహారం, తినుబండారాల (Gastronomy) విభాగం నుండి ఎంపిక‌చేశారు.

భార‌త‌దేశం నుండి మొత్తం 18న‌గ‌రాలు ఈ నెట్‌వ‌ర్క్‌ లో స్థానం కోసం పోటీప‌డ‌గా వీటిలో కేవ‌లం 8 న‌గ‌రాలు మాత్ర‌మే నియ‌మిత స‌మ‌యంలో నిర్థేశిత ప్రొఫార్మాల ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను యునెస్కోకు పంపగలిగాయి. వీటిలో నాలుగు న‌గ‌రాలు హైద‌రాబాద్‌, ముంబాయి, శ్రీన‌గ‌ర్‌, ల‌క్నో లు మాత్ర‌మే ఎంపిక‌య్యాయి. హైదరాబాద్ న‌గ‌రం క్రియేటీవ్ సిటీస్ నెట్‌వ‌ర్క్‌ లో స్థానం పొంద‌డం ప‌ట్ల రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Next Story
Share it