Telugu Gateway
Politics

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించాల్సిందే..హైకోర్టు

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించాల్సిందే..హైకోర్టు
X

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఉదయం పదిన్నర గంటలకు కార్పొరేషన్ రెండు యూనియన్లతో చర్చలు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఆర్టీసికి పూర్తి స్థాయి ఎండీని నియమించకపోవటం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 28లోపు తమకు నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే చర్చలు మాత్రం మూడు రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొంది. కార్మికుల డిమాండ్లలో చాలా న్యాయబద్దమైనవే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టులో వాదనల సందర్భంగా జాక్ తరపు లాయర్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ..‘ చర్చల కోసం ప్రయత్నాలు చేశాను.

రెండు సార్లు ప్రభుత్వ న్యాయవాదులకు ఫోన్లు కూడా చేశాను...కానీ స్పందన లేదు...ప్రభుత్వం లో విలీనం చేస్తే తప్ప చర్చలు లేవు అని మేము ఎప్పుడు చెప్పలేదు...మేము అన్ని డిమాండ్ల మీ ముందుకు తెస్తాం..అందులో సాధ్యం అయ్యేవి ఏంటి కానివి ఏంటో చెప్పండి..ప్రతీ సమస్య ను లేబర్ కోర్టులే తేల్చాలి అంటే కుదరదు..కొన్ని సమస్యలకు చర్చలతో పరిష్కారం దొరుకుతుంది...ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడానికి 2013 లో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది... కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక వేసిన కమిటీ ఎలాంటి స్టెప్స్ తీసుకోలేదు.’ అన్నారు. ఆర్టీసీ యూనియన్లు ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాయి.

Next Story
Share it