రామ్ ‘రెడ్’ మూవీ ప్రారంభం
BY Telugu Gateway30 Oct 2019 12:06 PM IST

X
Telugu Gateway30 Oct 2019 12:06 PM IST
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు హీరో రామ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు పూరీకి..ఇటు రామ్ కు మంచి హిట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇఫ్పుడు రామ్ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తోపాటు రామ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అదే ‘రెడ్’ సినిమా. ఓ తమిళ సినిమాకు రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఇఫ్పటికే ‘నేను శైలజ, ఉన్నది ఒకటి జిందగీ సినిమాలు వచ్చి మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. మరి వీరిద్దరి హ్యాట్రిక్ సినిమాపై కూడా అభిమానుల్లో మంచి అంచనాలు ఉండటం సహజం. రెడ్ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం నాడు హైదరాబాద్ లో జరిగాయి.
Next Story



