Telugu Gateway
Telangana

తొలి పీపీపీ లాజిస్టిక్ పార్క్ ను ప్రారంభించిన కెటీఆర్

తొలి పీపీపీ లాజిస్టిక్ పార్క్ ను ప్రారంభించిన కెటీఆర్
X

దేశంలోనే తొలి ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) మోడల్ లాజిస్టిక్ పార్క్ ను తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంగళ్ పల్లి సమీపంలో ఈ పార్కును హెచ్ఎండీఏ-అంకాన్ సంస్థలు ఏర్పాటు చేశాయి. కొత్తగా మరో ఎనిమిది లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కెటీఆర్ వెల్లడించారు.ఎలిమినేడులో ఏరో స్పేస్ ప్రాజెక్ట్ రానుందని తెలిపారు. ముచ్చర్లలో ఫార్మా క్లస్టర్ రానుంది. ఫార్మా క్లస్టర్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు రానున్నాయి.అపోహలను నమ్మకండి.ఓ ఆర్ ఆర్ చుట్టు ఎన్నో పరిశ్రమలు స్థాపించవచ్చు.

రెండు రైల్వే టర్మినల్స్ వస్తున్నాయి, వాటిని అనుసందానం చేసుకోని పరిశ్రమలు స్థాపించాలి.లాజిస్టిక్ పార్క్ ల స్థాపనకు మన నగరం అగ్ర భాగంలో ఉంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని మునిసిపాలిటీ లకు నిదులు మంజూరు చేస్తున్నాము.మనందరం కోరుకునేది ఉద్యోగాల కల్పనే.స్థానికులు పరిశ్రమలు వచ్చినప్పుడు స్వాగతించాలి.మునిసిపల్ చట్టం చాలా కటినంగా ఉంది.పని చేయకపోతే పదవి పోతది అని కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story
Share it