దివాకర్ ట్రావెల్స్ కు షాక్.. బస్సులు సీజ్
BY Telugu Gateway17 Oct 2019 9:58 AM IST

X
Telugu Gateway17 Oct 2019 9:58 AM IST
ఏపీ రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. మాజీ ఎంపీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ కు షాక్ ఇచ్చింది. ఏకంగా ఆ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. అదే సమయంలోజేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు.
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేసి నిబంధనలకు విరుద్దంగా చేస్తున్నట్టు గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆర్ టీఏ అధికారులు తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ పై అనేక ఫిర్యాదులు వచ్చాయని… అందులో భాగంగానే తనిఖీలు చేశామని… విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు వెల్లడించారు.
Next Story