Telugu Gateway
Telangana

ప్రియుడితో కలసి తల్లిని చంపిన కూతురు

ప్రియుడితో కలసి తల్లిని చంపిన కూతురు
X

మంచి మాట చెప్పటమే ఆమె పాలిట శాపం అయింది. ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి ప్రేమాయణం సాగిస్తున్న యువతిని తల్లి మందలించింది. అంతే పెంచుకున్న యువతి..తన ప్రియుడితో కలసి ఏకంగా తల్లినే హత్య చేసిన దారుణ సంఘటన ఇది. ఈ వ్యవహారం ఇఫ్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసుల చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి ఉపాధి కోసం భార్య రజిత (38), కూతురు కీర్తితో కలిసి నగరానికి వలసవచ్చాడు. ప్రస్తుతం వీరు మునగనూరులో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా రజిత ఇంటివద్దే ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

తమ కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లుగా తల్లి రజిత గుర్తించింది. ఇది మంచి పద్ధతి కాదంటూ కూతురిని మందలించింది. దీంతో తల్లిపై ద్వేషం పెంచుకున్న కీర్తి.. తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమెను కడతేర్చాలని భావించింది. అందులో భాగంగా ప్రియుడితో కలిసి పథకం రచించి తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని అతడితో పాటు అక్కడే మూడురోజుల పాటు ఉంది.

ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎవరికైనా అనుమానం వస్తుందోమోనని భయపడి... ప్రియుడి సహాయంతో తల్లి మృతదేహాన్ని రామన్నపేట సమీపంలోని రైలు పట్టాల మీద పడేశారు. తర్వాత తాను వైజాగ్‌ టూర్‌కు వెళ్తున్నానని తండ్రికి చెప్పి... ఇంటి వెనుకాలే ఉండే తన మరో ప్రియుడితో కీర్తి గడిపింది. తల్లి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన తండ్రి తాగి రావడంతో కొన్నిరోజులుగా అమ్మానాన్నల మధ్య గొడవ జరుగుతోందని... విచారణ జరపాల్సిందిగా పోలీసులను కోరింది. విధుల నుంచి ఇంటికి వచ్చిన శ్రీనివాసరెడ్డి.. రజిత గురించి కీర్తిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో భాగంగా తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను హతమార్చినట్లు కీర్తి అంగీకరించినట్లు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును విచారణ చేస్తున్నారు.

Next Story
Share it