Telugu Gateway
Cinema

హీరోయిన్ అంజలిపై ఫిర్యాదు

హీరోయిన్ అంజలిపై  ఫిర్యాదు
X

హీరోయిన్ అంజలి చిక్కుల్లో పడనుందా?. గతంలో ఓ సారి కుటుంబ వివాదాల కారణంగా ఆమె కెరీర్ కు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. మంచి పీక్ లో ఉన్న సమయంలో తలెత్తిన వివాదం ఆమె కెరీర్ ను దెబ్బతీశాయనే చెప్పొచ్చు. తాజాగా పాపులర్ హీరోయిన్ అంజలిపై మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయా ఉత్పత్తుల బ్రాండింగ్ చేసే వారు అందులోని మంచి చెడులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే అంజలి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ ఆయిల్ ఏ మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్నారని.. అలాంటి బ్రాండ్ కు మద్దతుగా ఆమె ప్రచార చిత్రాల్లో నటిస్తున్నందున ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఫిర్యాదు నమోదు అయింది.

ఈ మేరకు అంజలిపై తమిళనాడులోని కోవై ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు అందింది. కోవై సుడర్‌పార్వై మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఒక ఫిర్యాదు చేశారు. ఈరోడ్ ప్రధాన కార్యాలయంగా సదరు నూనె కంపెనీ నడుస్తోందన్నారు. వారు తయారు చేస్తున్న వంట నూనెను కొనుగోలు చేసి పరిశోధనలకు పంపామని తెలిపారు. ఆ పరిశోధనలో తయారీదారులు నిభంధనలను పాటించడం లేదని తెలిసిందన్నారు. ఆ వంటనూనెతో ప్రజలకు హానికరం అని నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. వంటనూనెను కోవై జిల్లాలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ఆ వంటనూనెను స్వాధీనం చేసుకుని, తయారీ దారుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story
Share it