Telugu Gateway
Politics

చిదంబరానికి బెయిల్

చిదంబరానికి బెయిల్
X

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి పెద్ద ఊరట. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఆయనకు మంగళవారం నాడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన జైలులో ఉండగానే ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) మరోసారి అదుపులోకి తీసుకోవటంతో ఆయన ఈ నెల 24 వరకూ అక్కడే ఉండాల్సి న పరిస్థితి ఉంది.

అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్‌ లభించింది. ఈ కేసులో తనకు బెయిల్‌ నిరాకరిస్తే ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో చిదంబరంను సీబీఐ ఆగస్ట్‌ 21న అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపైనా సీబీఐ చార్జిషీట్‌ నమోదైంది.

Next Story
Share it