Telugu Gateway
Telangana

నేనే రాజు..నేనే మంత్రి అంటే నడవదు

నేనే రాజు..నేనే మంత్రి అంటే నడవదు
X

ఆర్టీసీ జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ‘నేనే రాజు..నేనే మంత్రి’ అంటే కుదరదని వ్యాఖ్యానించారు. సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం కూడా రావొచ్చని కీలక వ్యాఖ్యలు చేయటం విశేషం. గతంలో వైస్రాయ్ లో జరిగిన ఘటనను మర్చిపోకూడదని అన్నారు. ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో తనతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు మరికొంత మంది కూడా మాట్లాడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ లోని టీఎంయూ కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాప్ చేస్తోందని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. సర్కారుతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని..అదే సమయంలో విలీనం ఎలా సాధ్యం అవుతుందో కూడా చెబుతామని అన్నారు. సర్కారు వైఖరిని కోర్టులో ఎండగడతామని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ కన్నా కేసీఆర్‌ మేధావా? 1993-94 సంక్షోభాన్ని కేసీఆర్‌ మర్చిపోకూడదని అన్నారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌, జగదీశ్‌ రెడ్డి మౌనం వీడాలని కోరారు. మేధావులు మౌనంగా ఉండకూడదు. పలువురు మంత్రులు కార్మికులను విమర్శించి ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు.

Next Story
Share it