Telugu Gateway
Andhra Pradesh

రైతు భరోసాకు 5510 కోట్లు విడుదల

రైతు భరోసాకు 5510 కోట్లు విడుదల
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన రైతు భరోసా అమలుకు రంగం సిద్ధమైంది. ఈ పథకాన్ని అక్టోబర్ 15న ప్రారంభించనున్నారు. దీని కోసం సర్కారు 5510 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల నిర్ధేశిత ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నిధులను ఇతర బాకీలకు మరల్చకుండా సర్కారు ముందుగానే బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది.

రైతు భరోసా పథకాన్ని సీఎం జగన్ ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని ప్రారంభించనున్నారు. అ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. దీంతో పాటు రైతులకు రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద సాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఇదివరకే అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు ఈ పథకం ద్వారా లభ్ధి చేకూరనుంది.

Next Story
Share it