Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ కొత్త సినిమా షురూ

అల్లు అర్జున్ కొత్త సినిమా షురూ
X

‘నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి అల..వైకుంఠపురములో సినిమా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ఇఫ్పుడు తుది దశకు చేరుకుంది. సంక్రాంతిలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మరో కొత్త సినిమాకు అల్లు అర్జున్ రెడీ అయిపోయారు. ఈ సినిమా క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం బుధవారం నాడు జరిగింది. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి నటించనున్నట్లు సమాచారం. అయితే ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ ఇదే తొలిసారి. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల..వైకుంఠపురములో వారి హ్యాట్రిక్ సినిమా. ఇప్పుడు కొత్తగా సుకుమార్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో తెరకెక్కేది కూడా వీళ్ళిద్దరి మూడవ సినిమా కావటం విశేషం. ఇది అల్లు అర్జున్ 20వ సినిమా.

Next Story
Share it