Telugu Gateway
Cinema

అల...వైకుంఠపురము నుంచి అలా ఒకటి

అల...వైకుంఠపురము నుంచి అలా ఒకటి
X

టాప్ హీరోల ఫ్యాన్స్ కు పండగే. ఒకటి దసరా పండగ..మరొకటి కొత్త చిత్రాల విడుదల పండగ. ఓ వైపు సీనియర్ హీరో బాలకృష్ణ, మరో వైపు మహేష్ బాబు, అల్లు అర్జున్ ల వరస సందడి. అల..వైకుంఠపురము సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ అలా...అల్లు అర్జున్ కు సంబంధించిన న్యూలుక్ విడుదల చేసింది. ఇది అల్లు అర్జున్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ సినిమా అంటేనే ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి.

దీనికి తోడు తాజాగా విడుదల చేసిన సామజవరగమన క్లాసికల్ సాంగ్ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్, యస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. తాజాగా విడుదల చేసిన లుక్ లో రౌడీలను చితక్కొట్టి.. స్టైల్‌గా నిల్చొని ఉన్న చిత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Next Story
Share it