Telugu Gateway
Politics

శిల్పులు కెసీఆర్ ను దేవుడిగా భావించారు

శిల్పులు కెసీఆర్ ను దేవుడిగా భావించారు
X

యాదాద్రి దేవాలయంలో ముఖ్యమంత్రి కెసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, కెసీఆర్ కిట్ పథకాల చిత్రాల వివాదంపై యాదాద్రి దేవస్థానం అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు వివరణ ఇచ్చారు. ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో ఆర్కిటెక్ట్ ఆనంద సాయితో కలసి మీడియాతో మాట్లాడారు. శిల్పులు అభిమానంతోనే కెసీఆర్ చిత్రం చెక్కారు తప్ప..దీని వెనక ఎవరి ఆదేశాలు లేవన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కెసీఆర్ బొమ్మ తీసేయటానికి కూడా తాము రెడీ అని తెలిపారు. శిల్పులకు ఓ ప్రత్యేక శైలి ఉంటుందని..వారి దాని ప్రకారమే ముందుకెళతారని చెప్పారు. అహోబిలంలో గాంధీ, నెహ్రు చిత్రాలు కూడా ఉంటాయన్నారు. ఎవరు బొమ్మలు చిత్రించాలన్నది అన్నది శిల్పుల విశేషాధికారం అని కిషన్ రావు పేర్కొన్నారు. కెసీఆర్, కారు బొమ్మల గురించి మాట్లాడుతూ ఫ్యూచర్ జనరేషన్ కు ప్రస్తుత పరిస్థితులను తెలపాల్సిన పరిస్థితి ఉందన్నారు. అంతే కానీ కెసీఆర్ ప్రచారం కోసం చెక్కామనటం సరికాదు.

భవిష్యత్ తరాలకు హిస్టరీ చూపించాలి అని వాళ్ళకు శిల్పులకు ఫ్రీడం ఇచ్చామన్నారు. వాళ్ళు అభిమానంతో చెక్కారు. ఆనందసాయి మాట్లాడుతూ సీఎంగారిని దేవుడిగా చూస్తున్నారు. ఆ ఫీలింగ్ తో చూస్తే ప్రేమతో చెక్కుతున్నారు. అధికారులు ఎవరు చెప్పలేదు. యాదాద్రి ప్రాకారంలో 3000 ఇమేజ్ స్ ఉన్నాయని ఆనంద సాయి చెపితే... ఐదు వేల ఇమేజ్ ఉన్నాయని కిషన్ రావు తెలిపారు. ఫారెనర్స్ వచ్చినా హిస్టరీ తెలుస్తుంది. శిల్పి తన వర్క్ మెన్ షిప్ చూపించటానికి ఇలా చేస్తారు ఆనంద్ సాయి. ఎవరికైనా అభ్యంతకరం అయితే ఆలోచిస్తాం. ప్రభుత్వం ఓ యజ్ణంలా ఆలయాన్ని కట్టిస్తోంది. కారు బొమ్మను ఒక పార్టీకి పరిమితం చేయటం దుర్మార్గం. ఇందిరాగాంధీ, నెహ్రు, కమలం గుర్తులు చిత్రీకరించారు. ఎడ్లబండి, సైకిల్ బొమ్మలు కూడా ఉన్నాయని తెలిపారు.

Next Story
Share it