Telugu Gateway
Cinema

శృంగారంపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

శృంగారంపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
X

కంగనా రనౌత్. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆమె ఏమి మాట్లాడినా వివాదమే. ఎందుకంటే ఆమె మాటలు కూడా అలాగే ఉంటాయి. తాజాగా ఆమె ఇండియా టుడే నిర్వహించిన ‘మైండ్ రాక్స్ 2019’ సమావేశంలో మాట్లాడుతూ ‘సెక్స్’కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పిల్లల సెక్స్ నుద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అవుతున్నాయి. పిల్లలు బాధ్యతాయుతమైన సెక్స్ లో పాల్గొనాలని అన్నారు. అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని..ఒకరితోనే సంబంధం కొనసాగించటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. తాను సెక్సువల్ గా చాలా యాక్టివ్ గా ఉన్నానన్న విషయం తెలుసుకుని తన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారని కంగనా రనౌత్ తెలిపారు. అంతే కాదు శృంగారంపై మరిన్ని సంలచన వ్యాఖ్యలు చేసింది. 'ప్రతీ ఒక్కరి జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైన అంశం.

శృంగారం కావాలనిపించినపుడు దానిని ఆస్వాదించాలి. వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. తమ పిల్లలు శృంగారంలో పాల్గొనడం పట్ల తల్లిదండ్రులు ఆనందించాలి. ఒక వయసుకు వచ్చిన పిల్లలు శృంగారంలో పాల్గొనేలా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి. పిల్లలు కూడా శృంగారం విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలి. మన పవిత్ర గ్రంథాలు శృంగారాన్ని అనుమతించవు. ఇప్పటికీ మన ఆలోచనల్లో పురోగతి కనిపించడం లేదు.’ అని వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో ఆమె తన మొదటి ప్రేమ, ముద్దు ముచ్చట గురించి కూడా చర్చించడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story
Share it