విజయ్ న్యూలుక్ వైరల్
BY Telugu Gateway26 Sept 2019 8:23 PM IST

X
Telugu Gateway26 Sept 2019 8:23 PM IST
విజయ్ దేవరకొండ న్యూలుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనికి భిన్నంగా కొత్త లుక్ ఉంది. అయితే ఇది ఏ సినిమాలో అన్నది తెలియదు కానీ..ఈ ఫోటోలు మాత్రం ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు. విజయ్ గత సినిమా డియర్ కామ్రెడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా సరే విజయ్ దేవరకొండ మాత్రం వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఓ వైపు వరల్డ్ ఫేమస్ లవర్ తోపాటు పూరీ జగన్నాథ్ ‘ఫైటర్’ సినిమా చేయటానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
Next Story