Telugu Gateway
Cinema

విజయ్ ఇక ఆ లుక్ ను వీడరా!

విజయ్ ఇక ఆ లుక్ ను వీడరా!
X

విజయ్ దేవరకొండ ఇక ఆ లుక్ ను వదిలిపెట్టరా?. అర్జున్ రెడ్డిలో అదే లుక్. డియర్ కామ్రెడ్ లో అదే గడ్డం..ఇప్పుడు మళ్ళీ వరల్డ్ ఫేమస్ లవర్ లో చిత్రంలోనూ అదే స్టైల్ . కాకపోతే ఈ లుక్ లో కాస్త మొహంపై రక్తమరకలు వచ్చాయి అంతే. కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్‌ కమర్షియల్స్‌పై కేయస్‌ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా, కేథరిన్‌ థెరీసా, ఐశ్వర్యా రాజేశ్, ఇజాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

Next Story
Share it