Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు ఊర్మిళ షాక్

కాంగ్రెస్ కు ఊర్మిళ షాక్
X

ఊర్మిళ మటోండ్కర్. తెలుగు ప్రేక్షకులకు ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకే ఒక్క సినిమా రంగీలాతో ఆమె తెలుగులో అంతగా పాపులర్ అయ్యారు. ఆమె చాలా సినిమాలు చేసిన రంగీలా మాత్రం హైలెట్ అని చెప్పుకోవాలి. బాలీవుడ్ హీరోయిన్ గా దుమ్మురేపిన ఆమె చాలా మంది నటీమణుల తరహాలోనే పొలిటికల్ ఎంట్రీ ఇఛ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి దారుణ పరాజయం చవిచూశారు. తాజాగా ఆమె కాంగ్రెస్ గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకుని కలకలం రేపారు.

లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఆమె అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని ఆమె మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ముంబై కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో పార్టీ కోసం పని చేయడం లేదని, కాలానుగుణంగా పార్టీలో మార్పులు చేస్తూ కాంగ్రెస్‌ అభ్యున్నతికి కృషి చేసేవారు కరువయ్యారని ఊర్మిళ ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి తన మనసు అంగీకరించడంలేదన్నారు. కాంగ్రెస్ ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ ఆమె రాసిన లేఖ బయటకు రావటం కూడా మహారాష్ట్ర కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది.

Next Story
Share it