Telugu Gateway
Politics

తెలంగాణ టీడీపీకి మరో షాక్

తెలంగాణ టీడీపీకి మరో షాక్
X

తెలంగాణ తెలుగుదేశానికి మరో షాక్. ఓ వైపు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తానని ప్రకటిస్తుంటే..మరో వైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇఫ్పటికే చాలా మంది ఆ దిశగా చాలా మంది పయనించగా..తాజాగా దేవేందర్ గౌడ్ తనయుడు,తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ టీడీపికి రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు. లేఖలోని ముఖ్యాంశాలు..‘ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు.

అయితే కొంత కాలంగా వివిధ రాజకీయ అవసరాల కోసం ఈ సిద్ధాంతాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ రాజీపడింది. ఇది నన్ను ఎంతగానో బాధించింది. పార్టీకి సిద్ధాంతాలు లేకపోవటం అన్నది ఆత్మ లోపించటమే.’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తనకు స్పూర్తి దేవందర్ గౌడ్, చంద్రబాబే అని పేర్కొన్నారు. చంద్రబాబు పరిపాలనా దక్షత, కష్టపడేతత్వం తనను ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ త్వరలోనే బిజెపిలో చేరే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it