Telugu Gateway
Politics

తెలంగాణ కొత్త మంత్రులు వీళ్ళే

తెలంగాణ కొత్త మంత్రులు వీళ్ళే
X

తెలంగాణ మంత్రివర్గంలో కూర్పులే. మార్పులు లేవు. కొత్తగా ఆరుగురికి చోటు కల్పించారు తప్ప...ప్రచారం జరిగినట్లు ఎవరినీ తప్పించలేదు. దీంతో ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయం అంతా సాఫీగానే సాగనుంది. కొత్తగా మంత్రివర్గంలోకి మాజీ మంత్రులు కెటీఆర్, హరీష్ రావు లతోపాటు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ లకు చోటు దక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి హామీ ఇఛ్చాకే పార్టీ మారారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఆమెకు మంత్రివర్గంలో చోటుదక్కింది.

ఆది వారం దశమి మంచిరోజు కావడంతో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తమిళ్ సై సౌందరరాజన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌తోపాటు మరో 10 మంది మంత్రులు ఉన్నారు. ప్రస్తుతమున్న మంత్రులను కొనసాగిస్తూనే కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై సీఎం కసరత్తు పూర్తి చేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు హరీష్ రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), పువ్వాడ అజయ్‌ కుమార్‌ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్‌ పేర్లు ఖరారయ్యాయి.

Next Story
Share it